Home » అంజలి సీబీఐలో పోలీసులనే బెదిరించిన ఈ పాప.. ఇప్పుడు ఎంతలా మారిందంటే..? – Sravya News

అంజలి సీబీఐలో పోలీసులనే బెదిరించిన ఈ పాప.. ఇప్పుడు ఎంతలా మారిందంటే..? – Sravya News

by Sravya Team
0 comment
అంజలి సిబిఐలో పోలీసునే బెదిరించిన ఈ పాప.. ఇప్పుడు ఎంతలా మారిందంటే..?










లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఈ మధ్య కాలంలో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సంగతి విదితమే. అనామిక చిత్రం నుండి తన పంథాను మార్చింది. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తోంది. అటు స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. ఇటు ఫీమేల్ లీడ్ పాత్రలతో అదరగొడుతుంది. హీరో ఉన్నా.. తన రోల్ బలంగా ఉండేలా ప్లాన్ చేస్తుంది. అలా వచ్చిన చిత్రాల్లో ఒకటి ఇమైక్క నోడిగల్. 2018లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో అంజలిగా పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది నయన్. రూ. 15 కోట్లు సినిమా తీస్తే.. దాదాపు రూ. 50 కోట్లను వసూలు చేసింది ఈ చిత్రం. ఇది తెలుగులో అంజలి సిబిఐ పేరుతో డబ్ అయ్యింది.

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒకరు కోలీవుడ్ టాలెంట్ హీరో విజయ్ సేతుపతి గెస్ట్ రోల్ చేశాడు. యంగ్ యాక్టర్ అధర్వ ఇందులో మరో హీరో. నయనతారకు సోదరుడిగా నటించాడు. అలాగే ఈ మూవీతోనే కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ అందాల భామ రాశి ఖన్నా. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నెగిటివ్ రోల్ చేశాడు. ఇక ఇదే సినిమాలో ఓ చిన్న పిల్లగా నటించింది గుర్తుందా.. ఇందులో విజయ్ సేతుపతి- నయన తార గారాల పట్టిగా నటించిందో పాప. షాలిని అలియాస్ షాలుగా అలరించింది. ఇందులో తల్లికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. ఓలీసాఫీసర్ తన ఇంటికి వస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేస్తుంది. ‘ఏంటయ్యా ముగ్గురు లేడీస్ ఉన్న ఇంటికి మాటి మాటికి వచ్చి విసిగిస్తున్నావ్’ అంటూ ఓ పోలీసు అధికారికి ఇచ్చి పడేస్తుంది.

అలాగే తన తల్లిని అవమానిస్తున్నాడని తెలిసి.. కత్తిని తీసుకెళ్లి పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఆమె నటనను చూసి ఫిదా కాని వారుండరు. ఇంతలా ఆ మూవీలో అలరించిన పాప ఎవరు.. ఇప్పుడు ఏం చేస్తుందంటే..? ఆ చిన్నారి పేరు మనస్వి కొట్టాచి. తమిళ కమెడియన్ కొట్టాచి కూతురే ఈ మనస్వి. మొదట మోహిని అనే చిత్రంలో నటించింది.కానీ అంతగా గుర్తుండిపోయే పాత్ర కాదు. ఆ తర్వాత ఇమైక్కా నోడుగల్ మూవీలో యాక్ట్ చేసింది. ఈ సినిమాతో మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ఆమె కీలక పాత్రలో మై శాంత అనే మలయాళ మూవీ చేసింది. రజనీకాంత్ దర్బార్, ఎనిమీ మొదలుకొని ద లెజెండ్, డీడీ రిటర్న్స్, చంద్రముఖి 2 చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పాప కాస్త పెద్దదైంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ప్రమోషన్లను చేస్తుంది. ఇంకొన్నిరోజులు పోతే హీరోయిన్ మెటీరియల్ కావడం పక్కా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి





You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in