అభిమాని రేణుకా స్వామి హత్య కన్నడ టాప్ హీరో, డీ బాస్ దర్శన్ తూగదీప అరెస్టు కావడం చందన సీమలో కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రియురాలి కోసం చేతికి రక్తపు మరకలు అంటించుకున్నాడు. ఈ కేసులో దర్శనం, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ్‌తో పాటు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే పవిత్ర గౌడ పోలీసు కస్టడీ ముగియడంతో 14 రోజుల జ్యూడిషీయల్ రిమాండ్ కోర్టు విధించింది. ప్రస్తుతం బెంగళూరులో పరప్పన అగ్రహార జైలులో ఉంది. ఇదిలా ఉంటే.. దర్శన తూగదీపకు శనివారం పోలీసుల కస్టడీ ముగిసిపోవడంతో.. స్థానిక కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. ఆయనతో పాటు నలుగురు నిందితులకు జులై 4 వరకు జ్యూడిషీయల్ కస్టడీకి అప్పగించారు. దీనితో వీళ్లను కూడా పరప్పన జైలుకు.
ఇదిలా ఉంటే దర్శన్ అరెస్టుపై తోటి నటి నటులు భిన్నంగా ఉన్నారు. కిచ్చా సుదీప్.. నిందితులకు శిక్ష పడాలని, రేణుకా స్వామి కుటుంబానికి న్యాయం జరగాలని తెలిపాడు. అలాగే.. ఉపేంద్ర కూడా స్పందించాడు. కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య నెగిటివ్‌గా కనిపిస్తోంది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, ప్రజలను కొట్టడం, చంపడం చేయొద్దు అంటూ ఇన్ స్టాలో పోస్టు చేసింది. అయితే కొంత మంది నటిమణులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. సంజనా గల్రానీ కూడా పాజిటివ్‌గా స్పందించింది. ఇప్పుడు మరో నటి కూడా అనూషా రాయ్ కూడా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అతడు అరెస్టు కావడాన్ని నమ్మలేకపోతున్నానని చెబుతుంది ఈ బ్యూటీ.
‘దర్శన్ సెట్లో అందరినీ కేరింగ్‌గా చూసుకుంటాడు. కాకపోతే ఆయన అప్పుడప్పుడు కోప్పడుతుంటారు. అదెక్కడో ఆయనకు ఉన్న పెద్ద సమస్య. అదే అతడి బలహీనత. అందుకే అందరూ చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. నేను మాట్లాడినప్పుడు కూడా పరిధి దాటి మాట్లాడను. తనకు ఈ సమస్య ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలోనే చెప్పాడు. అయితే ఈ కేసుకు దర్శనానికి సంబంధం ఉందనే విషయం నాకు తెలియదు. దర్శనంపై కోపం ఉంటే ఆయన్ను అనుకోండి కానీ.. నటుడి భార్య, కొడుకుని మాత్రం తిట్టడం కరెక్ట్ కాదు. అలా చేస్తే క్షమించరాని నేరం అవుతుంది. ఇష్టమొచ్చినట్లు మాట్లాడి ఆ కుటుంబాన్ని మరింత క్షోభకి గురిచేసినట్లు అవుతుంది’ అని అనుష రాయ్ చెప్పుకొచ్చింది. రేణుకా స్వామి హత్య కేసులో జూన్ 11 నుంచి పోలీసు కస్టడీలో ఉన్న దర్శన్.. ఇప్పుడు జైలుకు వెళ్లాడు.