గత కొన్ని రోజులుగా ప్రముఖ కన్నడ స్టార్ హీరో దర్శన్, పవిత్ర గౌడ్ ల పేర్లు నెట్టింట మారు మోగిపోతున్నాయి. అయితే, వీరిద్దదరూ రేణనుకస్వామి హత్య కేసులో నిందితులుగా అరెస్టు అయిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. రోజుకొక కొతడ్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ విషయంలోనే ఈ కేసు మరింత కీలకమైనదిగా మారుతుంది. మరో పక్క ఇండస్ట్రీలో మొత్తం రేణుకస్వామి హత్య కేసులో దర్శన్ కు కాస్త వ్యతిరేకంగానే ఉన్నారు. అలాగే తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇక రేణుకస్వామి హత్య కేసులో A1 నిందితులుగా పవిత్ర ఉండగా.. A2 నిందితుడిగా దర్శన్ ఉన్నాడు. కాగా, వీరిద్దరిని బెంగళూర్ లో పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. అయితే జైలులో ఉన్న పవిత్ర తాజాగా మహిళా సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఇంతకి ఏం జరిగిందంటే.. మొన్నటి వరకు పడుకోకుండా తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న పవిత్ర కొత్తగా గొంతుమ్మ కోరికలను కోరుతుందట. అయితే పవిత్రకు రాత్రి నిద్రించడానికి జైలు సిబ్బంది ఒక దుప్పటిని ఇచ్చారు. ఇక ఆ దుప్పటిని వద్దని, ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలంటూ ఆమె గొడవ చేసినట్లు తెలిసింది.
అయితే జైలులో ఉండి కూడా అక్కడ సిబ్బందితో.. అది కావాలి, ఇది కావాలంటూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. పైగా జైలు భోజనం తినేందుకు కూడా ఆమె నిరాకరించారట. ఇక పవిత్ర ప్రవర్తనపై పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారట. అలాగే ఇది మీ ఇల్లు కాదు, మౌనంగా నేర్చుకోవాలని సిబ్బంది గట్టిగా హెచ్చరించారట. ఇదిలా ఉంటే.. దర్శన్ కు మాత్రం ఇతర ఖైదీల నుంచి ఏమైనా ప్రమాదం పొంచి ఉండొచ్చని అతడిని ప్రత్యేకమైన బ్యారక్‌లో ఉంచారు. రాత్రి భోజనంగా రాగి ముద్ద, చపాతి, అన్నం, సాంబార్, మజ్జిగ ఇచ్చారు. కానీ, భోజనం చేయని దర్శనం ఆలస్యంగా నిద్రపోయి ఉదయం 6.30 గంటలకు లేచి కొంతసేపు వాకింగ్ చేశారట. ఇక జైలు సిబ్బందిని వేడినీరు అడిగి తాగారు. అలాగే ఉదయం టిఫిన్ పలావ్ ఆరగించారు. ఇక భద్రత కోసం దర్శనాన్ని తుమకూరు జిల్లా జైలుకు బదిలీ చేయాలని పోలీసులు కోర్టుకు ఆదేశించారు. మరి, జైలులో ఉంటూ ఇంట్లో సౌకర్యాన్ని కోరుతున్న పవిత్ర పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.