రాయచోటి మండలం గుంటిమడుగుకు చెందిన వైఎస్ఆర్ సిపి నాయకులు రమణారెడ్డి ,ఇతరులను వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్రప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.గ్రామానికి వైఎస్ఆర్ సిపి నాయకుడా ఉండడం అతను చేసిన తప్పా అని ప్రశ్నించారు. గుంటిమడుగులో వైఎస్ఆర్ సిపి నాయకుల ఇళ్ల ముందర ప్లెక్సీలు పెట్టినా సర్దుకుపోయారని, ప్లెక్సీలు పెట్టిన వాళ్ళంతకు వాళ్లలో ఒకళ్లు ప్లెక్సీలు చించుకుని దానిపైన ఇళ్ల దగ్గర వాళ్ళే గొడవలకు దిగితే ఏమిటీ విషయం అని అడిగినందుకు పోలీసులు పిలిచి ఆదివారం నాడు రాత్రంతా పోలీసు స్టేషన్ లోనే పెట్టుకుని నిర్బందించడం హేయమైన చర్యని అని అన్నారు.ఈ విషయంపై తాను విజయవాడ నుంచి ఎస్ఐ నరసింహారెడ్డి ని ఫోన్ ద్వారా అనేక సార్లు మాట్లాడినా స్పందించలేదన్నారు. గౌరవ ప్రదంగా వ్యవసాయం చేసుకునేటటువంటి రమణా రెడ్డి,అమర నాధరెడ్డి కొంతమంది దళిత యువకులను అక్రమంగా స్టేషన్ లో నిర్బంధించడమే కాకుండా వారిని సిఐ చంద్రశేఖర్ దారుణంగా కొట్టారన్నారు. తమ ప్రాంత నాయకులకు ఏమైందోనన్న ఆందోళనతో పోలీసు స్టేషన్ దగ్గరకి వందమందికి దళిత ప్రజలువస్తే, మహిళలు అని కూడా చూడకుండా లాఠీ చార్జీ చేయడం దారుణమన్నారు. సిఐ చంద్రశేఖర్,ఎస్ ఐ నరసింహా రెడ్డి లు ఇద్దరూ కూడా ఇప్పటికీ అక్రమంగా చాలామందిని హింసిస్తూ దాడులు చేశారన్నారు.వారికి నిజంగా ఒకటే చెపుతున్నానని..మీరు చేస్తున్న ప్రవర్తన మంచిది కాదు .. అధికారం ఉంది కదా అని చెప్పి ఇప్పుడు మీరు అక్రమ కేసులు పెట్టడం, హింసించడం, వాడుతున్న బాష, వైఎస్ఆర్ సిపి నాయకుపట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఘోరంగా ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై చట్టప్రకరంగా ఎదుర్కొంటామన్నారు. తెలుగుదేశం వారే బొట్లచెరువు నుంచి వెళ్లి తమ వారిపై దాడికి పాల్పడితే, టి డి పి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, వైఎస్ఆర్ సిపి వారినే స్టేషన్ లోనే నిర్బంధించడం సరైన పద్ధతి కాదన్నారు.ఈరోజు ఇవన్నీ కూడా సి ఐ, ఎస్ ఐ లపైన ప్రయివేటు కేసులను ఫైల్ చేస్తున్నామన్నారు.ఈ విషయంపై డి ఎస్ పి దృష్టికి తీసుకువెళ్లినా ఇంతవరకు స్పందించలేదన్నారు.ఈ రోజు ఉదయమే ఎస్ పి గారి దృష్టికి తీసుకెళ్లుతామన్నారు.ఈ రోజు ఉదయమే వారిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.న్యాయపరంగా పోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న చర్యలు ఎక్కువకాలం కొనసాగవని సి ఐ, ఎస్ ఐ లు తెలుసుకోవాలన్నారు. తమ హయాంలో ఇటువంటి నీచరాజకీయాలు జరగలేదన్నారు.ఇది కూడా పోలీసు అధికారులు గుర్తెరిగి,కాలం కూడా ఇలానే ఉండదన్న విషయాన్ని తెలుసుకుని మసులుకోవాలని ఆయన హితవుపలికారు. వైఎస్ఆర్ సిపి నాయకులను తక్షణమే విడుదల చేయాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
గుంటిమడుగుకు వైఎస్ఆర్ సిపి నాయకులు రమణారెడ్డి ,ఇతరులను వెంటనే విడుదల చేయాలి…
7