మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితాన్ని దేశ యువత, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.భారతరత్న అబుల్ కలాం ఆజాద్ దేశ సమగ్రత కోసం, హిందూ ముస్లింల ఐక్యత కోసం పాటుపడ్డారన్నారు. దేశస్వాతంత్ర్య అనంతరం ఏర్పడిన మొదటి ప్రభుత్వంలో సుదీర్ఘంగా 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి, దేశంలో విద్యాసంస్కరణలకు విశిష్టమైన సేవలు అందించారన్నారు.భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, సంగీతం,సాహిత్యాల వికాసానికి వారు చేయూతనిచ్చారన్నారు.భారత విద్యారంగానికి అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలకు గుర్తుగా 1992 లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఇచ్చి గౌరవిచ్చిందన్నారు. ఉర్దూను రెండవ అధికార బాష గా గతంలో జగన్ ప్రభుత్వం గుర్తింపు నిచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి జాతీయ విద్యాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి
5