29
జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రకాశం గ్రౌండ్స్ వద్ద అండర్ 17 ఫుట్ బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు ఆటుపోట్లను తట్టుకొనే శక్తి ఎక్కువగా ఉంటుందని, క్రీడలతో పాటు చదువుకు సైతం సమాన ప్రాముఖ్యత ఇవ్వాలని అన్నారు. జిల్లా క్రీడారంగం అభివృద్ధి దిశగా పయనిస్తుందని.. అందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపడం అభినందనీయమని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. ఫుట్ బాల్ క్రీడ అంటే తనకు చాలా ఇష్టమని తాను డిఫెండర్ గా రాణించే వాడినని అన్నారు.