48
భద్రాచలం అశోక్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. దీపాలంకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, కొండిశెట్టి కృష్ణమూర్తి, ఎండి నవాబ్, రత్నం రజీనికాంత్ ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.