ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు తన రాజకీయాన్ని పూర్తిగా ఏపీకి కేటాయించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఇతర కీలక నేతలకు అప్పగించారు. అయితే చంద్రబాబు గతంలో పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకుంది. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారాన్ని చెలాయించడంతో తమకు ఉన్న అనేక ఇబ్బందులు దృష్ట్యామంది సీనియర్ నేతలు పార్టీని విడిచి వెళ్లిపోయారు. బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఆ పార్టీలోని ఎంతోమంది నేతలు పక్క చూపులు చూస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా క్షీణిస్తోందన్న గుర్తింపును గుర్తించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్కడ పార్టీని పునర్నిర్మించేందుకు ఇదే సమయానికి సిద్ధమయ్యారు. కొద్దిరోజుల కింద తెలంగాణలోని ముఖ్య నేతలతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఆదరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పార్టీ నేతలకు భరోసా కల్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బి.ఆర్.ఎస్ కు చెందిన పలువురు ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సోమవారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసంలో మల్లారెడ్డి చంద్రబాబును కలిసి పలు అంశాలపై చర్చించారు. మల్లారెడ్డితోపాటు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్‌రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డితో కలిసి పలువురు మాట్లాడారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగానే కలిసినట్లు ఆ నేతలు చెబుతున్నప్పటికీ రాజకీయ ప్రాధాన్యతను మాత్రం ఈ భేటీ సంతరించుకుంది. టిడిపిలో చేరేందుకు ఏ నేతల సుముఖంగా చెబుతున్నారు. అయితే ఈ సూచన మాజీ మంత్రి మల్లారెడ్డి ధృవీకరించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడతారంటూ ఎప్పటి నుంచో ప్రచారం. ఆ ప్రచారాన్ని ఆయన పూర్తిగా ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మల్లారెడ్డి టిడిపిలోకి పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.
టిడిపిలో చేరుతున్న నివేదిత కృష్ణారెడ్డి..
చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెబుతున్నట్లు తెలుగుదేశం పార్టీలో చేరడం లాంచన ప్రాయమేనన్న ప్రచారం. ఈ ప్రచారాన్ని ధ్రువీకరించేలా మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణలో టిడిపికి పూర్వవైభవం తీసుకువస్తామని ఉద్ఘాటించారు. హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత చంద్రబాబు అని ఈ సందర్భంగా ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హయాంలోనే సైబరాబాద్, హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని కృష్ణారెడ్డి కొనియాడారు.
దారుణ ఓటమితోనే పక్క చూపులు..
పదేళ్లపాటు అధికారాన్ని చలాయిస్తున్న బిఆర్ఎస్ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. అయితే ఆ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలోనే ఎమ్మెల్యేలను గెలుచుకోవడంతో పార్టీ మనుగడకు సంబంధించిన అంశంపై పెద్దగా చర్చ జరగలేదు. ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యంత దారుణంగా ఓటమి పాలైంది. ఒక్క స్థానంలోనూ విజయం సాధించేందుకు ఆ పార్టీ సీనియర్ నేతల్లో గుబులు మొదలైంది. పదేళ్లపాటును అనుభవించిన పార్టీకి ప్రజలు ఒక్కదానికి కూడా ఇవ్వకపోవడం పట్ల సీనియర్ నేతల్లో ఆందోళన పెరిగింది. బిఆర్ఎస్ లో ఉంటే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు ఇప్పట్లో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం లేదని ఎంతోమంది నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు మరి కొందరు ఎమ్మెల్యేలు బిజెపి వైపు, టిడిపి వైపు చూస్తున్నట్లు మాజీ మంత్రులు తాజాగా పలువురు సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడు ను కలవడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా పార్టీ మారేదని ప్రస్తుతం ఉన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ఎగ్జిట్ పోల్స్ తలకిందులు.. హర్యానాలో హ్యాట్రిక్ విజయం దిశగా బిజెపి
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..