6
జనవరి నుంచి రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో 80-85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోందన్నారు. అందులో 36లక్షల టన్నులు పీడీఎస్‌కు వచ్చినా సరిపోతుందన్నారు. నెలకు 2 లక్షల టన్నుల చొప్పున పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు.