Home » తెలంగాణ జూనియర్‌ కాలేజీల్లో ఉద్యోగాలు

తెలంగాణ జూనియర్‌ కాలేజీల్లో ఉద్యోగాలు

by v1meida1972@gmail.com
0 comment

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుందని రేవంత్ సర్కార్ చెబుతోంది. అదేబాటలో నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇటీవలే మెగా డీఎస్సీ ప్రకటించి ఇప్పటికే పరీక్షలు పూర్తి చేసిన ప్రభుత్వం.. వాటి ఫలితాలపై ఫోకస్ పెడుతూనే ఇతర నియామకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 2280 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులతో కాంట్రాక్ట్‌, పార్ట్‌ టైమ్‌, గెస్ట్‌ లెక్చరర్లుగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. త్వరలోనే నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల కానుంది. కాగా.. తమ ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. త్వరలోనే మరో 35 వేల ఉద్యోగాలు భర్తీకి కూడా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా జారీ కానుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పుడు వేసిన పోస్టులే కాకుండా.. మరో 6 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. యువతలో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వారికి నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు పూనుకున్నారు. ఉద్యోగాల విషయంలో ఉద్యోగార్థులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగార్థులకు సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు హామీ ఇస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in