సహజ వనరులు సమృద్ధిగా ఉన్న రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవ చూపాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి రామగుండంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఎన్ ఎస్ యు ఐలో పనిచేస్తున్న పటి నుండి రామగుండంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. సహజ వనరులైన నీరు, బొగ్గు పుష్కలంగా ఉండడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందన్నారు. రామగుండానికి పూర్వము తీసుకొచ్చేలా డిప్యూటీ సీఎం కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. చెన్నూరు, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయ రామారావు తదితరులు పాల్గొన్నారు.
రామగుండం అభివృద్ధికి చొరవ చూపాలి
60
previous post