ఏపీలో అధికారంలోకి వస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ విడుదలకు గతంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డీఎస్సీ విడుదలకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు. ఈ ప్రక్రియను మరింత వేగం పెంచే పనిలో అధికారులు పడ్డారు. మెగా డీఎస్సీ విడుదలకు సంబంధించిన నోటిఫికేషన్ ను మరో పది రోజుల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో కొన్నేళ్లుగా నిరుద్యోగుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడుతోంది. నవంబర్ మూడో తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డీఎస్సీ ప్రకటన ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టెట్ ఆన్‌లైన్ పరీక్షలు అక్టోబర్ 21న ముగియనున్నాయి. అనంతరం టెట్ ఫలితాలను నవంబర్ రెండో తేదీన నిర్వహించారు. డీఎస్సీలో సెకండరీ టీచర్ (ఎస్జిటి) పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్ టీచర్ (ఎస్ఏ) పోస్టులు 7,725, ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టిజిటీ) పోస్టులు 1781, పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులు టీచర్లు (పిజిటి) పోస్టులు 286, ప్రిన్సిపల్ 3 పోస్టులు 52 ఉన్నాయి. ఇప్పటికే టెట్‌లో మంచి స్కోరు సాధించిన అభ్యర్థులు సమయం వృథా కాకుండా డీఎస్సీ ప్రిపరేషన్ చేసుకోగలిగారు. అధిక మంది డిఎస్సీ కోచి తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిఎస్సీ పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఈ శిక్షణకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత బోధన, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతోపాటు స్టడీ మెటీరియల్ ప్రభుత్వం అందించనుంది. అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందితో ఆయా జిల్లాల్లో నెలలపాటు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 21వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అక్టోబర్ మూడో తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన ఏపీ టెట్ జూలై 2024 పరీక్షల ప్రశ్నపత్రాలు, ప్రిలిమినరీ ‘కీ’ల పేర్లతోపాటు రెస్పాన్స్ షీట్లను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పేపర్ 1ఎ, 1బి పరీక్ష క్రిమినరీ కీ, లపై అభ్యంతరాలను అక్టోబర్ 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాలని సూచించింది. మిగిలిన పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు, ఆన్సర్ కీలను పరీక్ష జరిగిన తర్వాత విడుదల కానున్నాయి. ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) పద్ధతిలో జరుగుతున్న ఈ పరీక్షలు 21తో ముగుస్తున్నాయి. అక్టోబర్ 27న తుది కీ విడుదల చేసి నవంబర్ 2న ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డిఎస్సి విడుదల చేయలేదు. రాష్ట్రంలో చివరిసారిగా ఏడేళ్ల కింద టీచర్ పోస్టులను భర్తీ చేశారు. మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు చివరి ఏడాదిలో నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, ఆ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంలో ఆ ప్రభుత్వం విఫలమైంది. ఆ పోస్టులను కూడా కూటమి ప్రభుత్వం భర్తీ చేసేలా నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. మెగా డీఎస్సీ ని కూటమి ప్రభుత్వం విడుదల చేస్తుండడంతో నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బీమాపై జీఎస్టీ మినహాయింపు.. కీలక నిర్ణయాన్ని తీసుకున్న కేంద్రం
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..