పీలేరు నియోజకవర్గం కె.వి పల్లి మండలం గర్నిమిట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆకస్మిక తనిఖీ చేశారు. మొదటగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ ను, ఓపి రిజిస్టర్ ను తనిఖీ చేశారు. మందులు అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిత తనిఖీ చేస్తూ అక్కడ ఉన్న అంగన్వాడీ ఉపాధ్యాయురాలిని పిల్లలందరూ సమయానికి వస్తున్నారా, ఏ సమయాలకు భోజనం పెడుతున్నారు వంటి ప్రశ్నలు అడిగారు. పిల్లలకు ఎప్పటికప్పుడు పౌష్టికాహారం అందించాలని పనిచేస్తున్న ఉద్యోగులకు ఆదేశించారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినులతో మాట్లాడుతూ భోజనం బాగుందా లేదా, పాఠాలు బాగా చెబుతున్నారా లేదా వంటి ప్రశ్నలు అడిగారు. సొంతంగా ప్రశ్నలు వేసుకొని విశ్లేషణాత్మకంగా చదువుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థినులకు సూచించారు.
గర్నిమిట్టలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్..
24