20
ఆగస్టు 5 నుంచి 13 వరకు గ్రామాల్లో ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ పేరుతో పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదన్న BRS ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తాము అధికారంలోకి వచ్చాక గ్రామ పంచాయతీలకు రూ.378 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు.