30
రుద్రంపూర్ లోని ప్రగతి వనం వద్ద ఫ్యామిలీ డే, బతుకమ్మ ఆటపాట సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా పరిసర ప్రాంతాలలో ఉంటున్న ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఎం. షాలేం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో బతుకమ్మలను తీసుకొచ్చిన వారికి పోటీలను నిర్వహించి బహుమతులను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ తోపాటు శ్రీమతి జి.మధురవాణి శాలెం రాజు, కొత్తగూడెం ఏరియా ఏఐటియుసి అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జే.గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, కొత్తగూడెం అధికారుల సంఘం ప్రెసిడెంట్ ఎం.వి నరసింహారావు, తదితరులు పాల్గోన్నారు.