13
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ తరఫు లాయర్ ఉమామహేశ్వరరావు దావా దాఖలు చేశారు. బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్, తుల ఉమను సాక్షులుగా పేర్కొన్నారు. పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. కాగా ఇప్పటికే సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.