సంగారెడ్డి నియోజకవర్గ :- వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో రైతులు వ్యవసాయ కార్యాలయం చుట్టూ గత వారం రోజులుగా చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని రైతులకు అందుబాటులో లేటటువంటి వ్యవసాయ అధికారులపై. చర్యలు తీసుకొని రైతుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఏం నరసింహులు అన్నారు. రోజు ఆరు గ్రామాల రైతులు ఉదయం 10 గంటల నుండి 11:30 గంటల వరకు ఆఫీస్ వద్ద అధికారుల కోసం ఎదురుచూస్తున్న. ఏ ఒక్కరు కూడా రానందువలన రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. వ్యవసాయ ఆఫీసుకు రాకుండా అధికారులు పర్యటనలో ఉన్నామని చెప్పడం సరైనది కాదని రైతులు ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన అధికారులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బ్యాంకు రుణాలు మాఫీ ఇతర సమస్యలు ఏమైనా ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని చెబుతున్నప్పటికీ. అధికారులు అందుబాటులో ఉండకపోవడం శోచనియమని అన్నారు. రైతు తన వ్యవసాయ పొలంలో పనులను వదులుకొని ఆఫీసుల చుట్టూ తిరగడం వల్ల అటు పంటలు నష్టపోవడం ఇటు అధికారులు దరకకపోవడం రెండు విధాల నష్టపోతున్నారని రైతులకు సరైన న్యాయం వ్యవసాయ అధికారులు చేయడం లేదని రెండు విధాల నష్టపోతున్నారని ఆఫీసులో కచ్చితంగా అధికారులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరో ఒకరు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కాశీపూర్, చర్యల్,ఉత్తరపల్లి,కంది,ఇంద్రకకరణ్, జుల్కల్, గ్రామాల రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్లక్ష్యం వీడాలి: సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. నర్సింలు
23