63
భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహానుభావుడు గాంధీజీ ఆశయాలే భారతీయులందరికి స్ఫూర్తిదాయకం అని DCMS చైర్మన్, మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మార్కెట్ లోని గాంధీ విగ్రహానికి కొత్వాల తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ లో సద్భావనా ర్యాలీ నిర్వహించారు.