73
వాహనదారులు అతివేగంగా ప్రయాణించి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రామాపురం మండలం చిట్లూరు గ్రామం సమీపంలో కారు, ట్యాంకర్ ఢీకొన్న ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కడప- చిత్తూరు, బెంగళూరు జాతీయ రహదారి కావడంతో వాహనదారులు అతి వేగంగా పోకుండా కొంచెం నెమ్మదిగా పోయినట్లయితే ప్రాణ నష్టం జరగదన్నారు. నేను అందరికీ విన్నవించడం ఏమిటంటే వాహనదారులు అతివేగంగా ప్రయాణం చేయవద్దని కోరుతున్నానని ఆయన అన్నారు.