హైదరాబాద్ : భవిష్యత్తులో భారీ వర్షాలు, వరదల వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (TGDRF) ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 25 పెద్ద టవర్లు కూలిపోయినప్పటికీ విద్యుత్తు సిబ్బంది వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అదే విదంగా 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్తు సమస్యలు, ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని గుర్తించి తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి నష్టాలను నివారించాలని చెప్పారు. వాగులు, వంకలు పొర్లుతున్న దృష్ట్యా దెబ్బతిన్న రోడ్లు, వరద ప్రవహిస్తున్న రోడ్లపై నుంచి ఎవరూ దాటే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసు, ఇతర విభాగాల అధికారులు బృందాలు ఏర్పడి అన్ని చోట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు.
విపత్తులను ఎదుర్కొనేందుకు టీజీడీఆర్ఎఫ్ ఏర్పాటు : సీఎం రేవంత్ రెడ్డి
28