మెదక్: అధిక వర్షాల కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని, జిల్లాయంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైందని కలెక్టర్ తెలిపారు. సోమవారం మెదక్ మండలం లోని తిమ్మనగర్, రాయీన్ పూర్,మల్క పూర్ గ్రామాల్లో, హవేలు ఘనపూర్ మండల కేంద్రంలో వర్షం కారణంగా ధ్వంసం అయన రోడ్డు, పంటలు, కాలువలు, చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారని క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సంఘటనలు జరిగిన తర్వాత మేల్కొనకంటే ముందే ఆ సమస్యను గుర్తించినట్లయితే తద్వారా పరిష్కారం సులభతరం అవుతుందని చెప్పారు. జిల్లాలో 396 చెరువులు పూర్తిగా నీటితో నిండాయని, ఏ సమయంలోనైనా బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు జిల్లాలో చెరువులు మండలాల వారీగా లిస్ట్ తయారుచేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం అందజేయాలని అటువంటి లిస్టును మండలాల్లో ఎంపీడీవో ఎంఆర్ఓ లకు అందజేయడం జరుగుతుందని, తద్వారా చర్యలు తీసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ తాసిల్దార్ అధికారి లక్ష్మణ్ బాబు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అధిక వర్షాలకు ప్రజలు అధైర్యపడద్దు: కలెక్టర్ రాహుల్ రాజ్
11