78
ఏటునాగారం ప్రభుత్వాసుపత్రిలో తీవ్రమైన రక్త కొరత ఉన్నందున ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చరిత మెడికల్స్ ప్రొప్రైటర్ గాంజర్ల రామ్మూర్తి సహకారంతో ఎటునాగార ప్రభుత్వ ఆసుపత్రికి 10 యూనిట్ల రక్తం దానం చేశారు. ఏటునాగారం డివిజన్ పరిధిలో జ్వరాలు కారణంగా తీవ్రమైన రక్త కొరతతో జనాలు ఇబ్బంది పడుతున్నారని వైద్య సిబ్బంది మరిన్ని రక్తదాన శిబిరాలు పెట్టాలని చేయూత ఫౌండేషన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు సాయి ప్రకాష్ చరిత మెడికల్ ప్రోప్రైటర్ గాంజర్ల రామ్మూర్తి, సాయి పవన్ రావుల నరేంద్ర కుమార్, ఆర్ఎంపీ జగదీష్ యువత ఎటునాగారం బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.