Home » రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by Sravya Team
0 comment
రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • సిఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం
  • రైతు భరోసా ఎకరాకు 15వేలు ఇవ్వాల్సిందే
  • కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి
  • కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

ముద్ర,పానుగల్ :- అమలుకు నోచుకోని పథకాలను ప్రచారం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యాన పానుగల్ మండలంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలనీ విస్తృత ప్రచారం చేసి గద్దెనెక్కిన అనంతరం ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహాయిస్తే ఇప్పటికీ ఏ హామీని నెరవేర్చారు. రైతు రుణమాఫీ విషయంలో చాలామంది రైతులకు రుణాలు మాఫీ కాలేదని అరకొరగా మాత్రమే రుణమాఫీ జరిగింది.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పండించిన వరి ధాన్యానికి 500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి సన్న రకానికి మాత్రమే అని మాట మారుస్తున్నారని అన్నారు.దగా కోరు మాటలతో గద్దెనెక్కిన దగా ప్రభుత్వం కాంగ్రెస్ దేనని అన్నారు.రైతు భరోసా ఇవ్వలేమని వ్యవసాయ శాఖ మంత్రి విడ్డూరంగా ప్రకటించారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. రైతుల సంక్షేమంపై నడ్డి విరుస్తుంది..కొల్లాపూర్ నియోజక వర్గంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు పూర్తి చేయాలన్నారు. పానగల్ సంస్థ కిష్టాపూర్ గ్రామ సమీపంలో రామన్న గట్టు రిజర్వాయర్ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలన్నారు.

సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

రైతాంగానికి ఈ సీజన్‌లో రైతు భరోసా ఇవ్వలేమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను నిరసిస్తూ పానుగల్ మండల బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సీఎం డౌన్ డౌన్,ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాల్సిందే,ననిపూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని,రైతు భరోసా ద్వారా 15 వేలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు,మాజీ ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్ రెడ్డి,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్,మాజీ రైతు బంధు మండల కో ఆర్డినేటర్ వెంకటయ్య నాయుడు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు వీర సాగర్,రాజేష్ రెడ్డి,గోపాల్ రెడ్డి,హర్షన్న యువసేన అధ్యక్షులు రంగాపురం శివా రెడ్డి,వివిధ గ్రామాల మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు,గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in