జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఆవరణలో ఆటో డ్రైవర్ల అందరికీ శుక్రవారం సాయంత్రం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా సహకరించాలని డిఎస్పి అబ్దుల్ రెహమాన్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఆటోడ్రైవర్లందరికీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశాలను జారీ చేశారన్నారు. డ్రైవర్ సీటు వెనక భాగంలో డ్రైవర్ పేరు, ఫోన్ నెంబరును ప్రయాణికులకు కనిపించే విధంగా కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంచి పనులు చేస్తున్న 15 మంది ఆటో డ్రైవర్లను గుర్తించి ఈ సందర్భంగా ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పల్లి ఎస్ఐ రమణారెడ్డి, 3 టౌన్ ఎస్ఐ పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించండి: అవగాహన సదస్సులో డిఎస్పి అబ్దుల్ రెహమాన్
51