46
ఏపీలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పాత పేర్లను పునరుద్ధరణ చేసింది. ఆయా ప్రాజెక్టులకు వాస్తవ పేర్లనే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ సహా కొందరి వైసీపీ నేతల పేర్లు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులకు గతంలో జగన్ ప్రభుత్వం పెట్టింది. గత ప్రభుత్వం పెట్టిన పేర్లను మారుస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.