Home » గుంటూరులో ఘోరం.. మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య..

గుంటూరులో ఘోరం.. మైనర్‌ బాలికపై అత్యాచారం, హత్య..

by v1meida1972@gmail.com
0 comment

గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది. గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలేనికి చెందిన బాలిక శైలజ (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొత్త రెడ్డిపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక.. రోజు మాదిరిగానే ఉదయం స్కూల్ కి వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి వెళ్లిపోయింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. స్కూల్ టైం గడిచిపోయినా బాలిక తిరిగిరాకపోవడంతో బంధువులు, తల్లిదండ్రులు గ్రామంలో పలుచోట్ల వెదకగా.. అదే గ్రామంలోని గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో అనుమానాస్పద రీతిలో విగతజీవిగా పడివుంది.

కూతురు మరణాన్ని తట్టుకోలేక కుటుంబీకులు తల్లడిల్లిపోయారు. ఆమె మెడపై గాయాలు కనబడటంతో అత్యాచారం, హత్యగా స్థానికులు భావిస్తున్నారు. మరోవైపు అదే ఇంట్లో ఉంటున్న నాగరాజు పరారీలో ఉన్నాడు.

కాగా నిందితుడు నాగరాజుకు అప్పటికై పెళ్లైంది. అయితే భార్యతో విభేదాల కారణంగా గత మూడేళ్లుగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులు నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేబ్రోలు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. తెనాలి డిఎస్పి రమేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే పట్టుకుని అరెస్ట్‌ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in