రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనేకచోట్ల ఈవీఎంల్లో అవకతవకులు జరిగాయి అంటూ ఆరోపణలు వస్తున్నాయి. కొన్నిచోట్ల పోలింగ్ జరిగిన దానికంటే అధికంగా ఓట్లు లెక్కించారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. అనుమానం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను మరోసారి లెక్కించాలంటూ వినతి పత్రాలను సమర్పించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంల్లో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు అందినందుకు 12 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్కింపు ప్రక్రియను సోమవారం చేపట్టనున్నారు. సోమవారం నుంచి ఆరు రోజులు పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను పరిశీలించనున్నారు. డమ్మీ బ్యాలెట్ ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియను జనరల్ ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియ, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏవో యం కు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంలు పరిశీలన జరగనుంది. ఈ ప్రక్రియను సీసీ కెమెరాలో నిఘా ఉంచిన అధికారులు.
ఒంగోలు నియోజకవర్గ పరిధిలో ఈ పోలింగ్ కేంద్రాల్లో నిర్వహణ
సోమవారం నుంచి ఆరు రోజులపాటు ఈవీఎంల పరిశీలనను ఒంగోలు నియోజక వర్గ పరిధిలో పలు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఒంగోలు నియోజక వర్గం నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు ఈసీ ఈవీఎంలు పరిశీలించారు. ఒంగోలు నియోజకవర్గంలోని 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలిస్తున్నారు. ఈవీఎంల పరిశీలనపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి. ఇక్కడ ప్రక్రియ తర్వాత రాష్ట్రంలోని ఇతర చోట్ల వచ్చిన ఫిర్యాదులపై కూడా ఎన్నికల సంఘం పరిశీలనకు వైద్యసేవలకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసిపికి చెందిన కార్యకర్తలు ఏం జరుగుతుందో అన్న ఆసక్తితో నాయకులు ఉన్నారు.
ప్రోటీన్ ఫుడ్స్: ఈ ఆహార పదార్ధాలలో గుడ్లు కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది
పెళ్లికి రెడీ అయ్యే జంటలు ఈ మెడికల్స్ చేయించుకోవడం ఉత్తమం