6
వేంపల్లిలోని నాలుగు రోడ్ల కూడలిలో ఓ వ్యక్తి పీకలదాకా మద్యం తాగి కింద పడిపోయి ఆదివారం తెల్లవారుజామున దాహం.. దాహమంటూ కేకలు వేసిన ఘటన చోటు చేసుకుంది. దీన్ని గమనించిన వేంపల్లె పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ రమణయ్య, హోంగార్డు కిషోర్ రెడ్డి అతనికి నీరు తాపి మానవత్వం చాటుకున్నారు. పోలీసుల మానవత్వానికి స్థానికులు అభినందనలు తెలిపారు.