77
చీని రైతులకు అన్యాయం చేస్తే సహించమని వ్యాపారులను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం పులివెందుల మార్కెట్ యార్డులో జరుగుతున్న చీని కాయల వేలంపాటను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యాపారస్తులు సిండికేట్గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నారన్నారు. అదే కాయలను నిన్న వేలంపాటలో రూ.14-15 వేలు పాడారని, ఇవాళ రూ.22-23 వేల వరకు పాడారన్నారు. దీనికి వ్యాపారుల సిండికేట్ కారణమన్నారు.