Home » వివాహితపై సామూహిక అత్యాచారం.. ఏలూరులో చోటుచేసుకున్న ఘటన – Sravya News

వివాహితపై సామూహిక అత్యాచారం.. ఏలూరులో చోటుచేసుకున్న ఘటన – Sravya News

by Sravya News
0 comment
వివాహితపై సామూహిక అత్యాచారం.. ఏలూరులో చోటుచేసుకున్న ఘటన


కలకత్తాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ ఒకవైపు ఆందోళన సాగుతుండగా.. మరోవైపు ఈ తరహా దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏలూరులో ఈ తరహా ఘటన మరొకటి జరిగింది. భర్తతో కలిసి మద్యం తాగిన కొందరు యువకులు అతని కొట్టి భార్యపై సామూహిక అత్యాచారాన్ని జరిపారు. శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరులో మూడు పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం విజయరాయికి చెందిన వ్యక్తి అతని రెండో భార్య ఏలూరు వన్ టౌన్ రామకోటి ప్రాంతంలో ఉన్నాడు. 15 రోజుల క్రితం నగరానికి వచ్చిన వీరు పగలు హోటల్‌లో ఉంటారు. రాత్రిళ్ళు రామకోటిలోని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే స్టేజి అరుగులపై విశ్రమిస్తారు. అద్దె ఇల్లు దొరికితే వెళదామని అనుకుంటున్నారు. వీరికి నగరానికి చెందిన ముగ్గురు యువకులు పరిచయమయ్యారు. ఈ ముగ్గురు యువకులు చిన్నచిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరుగుతుంటారు.

శుక్రవారం అర్ధరాత్రి ముగ్గురు యువకులు, విజయరాయి కలిసి మద్యం తాగారు. ఆ పక్కనే అతను భార్య నిద్రిస్తోంది. మద్యం మత్తు ఎక్కిన తర్వాత ముగ్గురు యువకులు అతనిపై దాడి చేశారు. అనంతరం పక్కనే నిద్రిస్తున్న అతని భార్యను కొద్ది దూరం లాకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఆమె ముఖంపై దాడి చేశారు. ఈ అధైత్యాన్ని అడ్డుకోవాలని భర్త కేకలు వేస్తూ పక్కనే ఉన్న రోడ్డుపైకి వచ్చి అటుగా వెళుతున్న యువకుడికి విషయం చెప్పి రక్షించాలని కోరాడు. ఆ యువకుడు స్పందించిన ఘటన స్థలానికి వస్తుండగా నిందితులు ముగ్గురు పరారయ్యారు. ఈ సమయంలో డయల్ 100కు కాల్ చేసినా సరిగా స్పందించలేదని సహాయం చేయడానికి వచ్చిన యువకుడు చెప్పాడు. వందకు కాల్ చేసి చెప్పగా చూస్తాం ఎక్కడ అంటూ మా భాగంగా మాట్లాడాలని సరిగా స్పందించలేదని తెలిసింది. తరువాత సమీపంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయం చెప్పగా పది నిమిషాల్లో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అత్యాచార ఘటనలో నిందితులు ముగ్గురిని ఏలూరు వన్ టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. చెంచుల కాలనీకి చెందిన నూతిపల్లి పవన్, లంబాకి పేటకు చెందిన నారపాటి నాగేంద్ర, మారడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డి విజయ్ కుమార్ అలియాస్ నానీలను వన్ టౌన్ ఎస్ఐ లక్ష్మణ్ బాబు, సిబ్బంది అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.

రక్షా బంధన్ | రాఖీ కట్టే సమయాలివే.. ఆ సమయంలో రాఖీ కడితే సోదరులకు అరిష్టాలే..
పెళ్లికి రెడీ అయ్యే జంటలు ఈ మెడికల్స్ చేయించుకోవడం ఉత్తమం

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in