Home » సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం.. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందాం.. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

by v1meida1972@gmail.com
0 comment

గాలివీడు మండల వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు, నాయకులు, అభిమానుల ఆత్మీయ సమావేశంలో మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డితో కలసి అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమిష్టి కృషితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామని ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులకు ఏ కష్టం వచ్చినా.. ఇబ్బందులు ఎదురైనా ఎల్లవేళలా తోడుగా అండగా ఉంటామని శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి లు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జల్లా సుదర్శన్ రెడ్డి, మండల కన్వీనర్ మిట్టపల్లి యదుభూషణ్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆవుల నాగభూషణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in