89
కొండాపురం మండలంలో ఓ వర్గానికి చెందిన నేతల మధ్య వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. టీ కోడూరులో అక్రమ గ్రావెల్ తవ్వకాల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిలువరించాలని ప్రయత్నించగా.. పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.