నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాదులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో మక్తల్, నారాయణపేట- కొడంగల్ నియోజకవర్గం లోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
ఈ ప్రాజెక్టు నిర్మాణానికై మూడు దశలు కలిపి 4,350 కోట్ల రూపాయలతో ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ఫిబ్రవరి నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గిలో
శంకుస్థాపన చేయడం జరిగింది
లక్ష 30 వేల ఎకరాలకు సాగునీరు
ఈ పథకం ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అత్యంత వెనుకబడిన మక్తల్, నారాయణపేట మరియు కొడంగల్ నియోజకవర్గాల్లోని లక్ష 30 వేల ఎకరాలకు సాగునీరు మరియు నారాయణపేట జిల్లాకు త్రాగునీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రాజెక్టుకు సంబంధించి 2014 లో ఇచ్చిన జీవో 69 కి కొనసాగింపుగా కొత్త జీవో నెంబర్ 14 తేదీ 8 /02/2024 నాడు జారీ చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జూరాల పై చేపట్టిన భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా భూత్పూర్ జలాశయం నుండి7 టిఎంసిల నీటి సామర్థ్యంతో నారాయణపేట -కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టనున్నారు
మూడు దశలలో నిర్మాణం
మొదట నాలుగు దశలలో నిర్మించాలని భావించిన ప్రభుత్వం భూ సేకరణ అధికం అవుతుంది అనే ఉద్దేశంతో మూడు దశలలోనే నిర్మించనున్నారు
మొదటి దశలో ఉట్కూరు, జాయమ్మ చెరువు మరియు కానుకుర్తి చెరువుల ఆధునీకరణతో పాటు, జలాశయాల నిర్మాణం కోసం ప్రభుత్వం 2,945 కోట్లు వెచ్చించింది
రెండో దశలో జాజాపూర్, దౌల్తాబాద్, బొంరాస్ పేట్, లక్ష్మీపూర్, ఈర్లపల్లి, హుస్నాబాద్ మరియు కొడంగల్ చెరువులసామర్థ్యాన్ని పెంచనున్నారు
గ్రావిటీ ద్వారా నీటిని ఇవ్వటానికై 1,404.50 కోట్ల రూపాయల అంచనాలతో డిస్ట్రిబ్యూటరీ కాలువలు నిర్మించనున్నారు
మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఉట్కూరు మరియు మక్తల్ మండలాల్లో 25,783 ఎకరాలకు గాను అలాగే నారాయణపేట సెగ్మెంట్ పరిధిలోనినారాయణపేట,ధన్వాడ మరియు దామరగిద్ద మండలాల్లో 20,472 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లోని కొడంగల్, మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్ మరియు బొంరాస్ పేట్ మండలాల పరిధిలోని 53,745 ఎకరాలకు మరియు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో అదనంగా మరో 30 వేల ఎకరాల భూమికి సాగునీరు అందించే లక్ష్యంతో మొత్తం మూడు దశలలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు