59
జోగుళాంబ గద్వాల జిల్లాలో అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కె.టి దొడ్డి మండలంలో “బ్రయిట్ ఫిచర్ స్కూల్ ” ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన ఇష్టనుసారంగా నడిపిస్తున్నారు. నూతనంగా.. బాలాజీ అనే వ్యక్తి స్కూల్ ప్రారంభం చేసి ఈ స్కూల్ లో యూనిఫామ్, టై, బెల్ట్, షూస్ విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. అలాగే బుక్స్ అధిక ధరలకు విక్రయించడంతో పాటుగా స్కూల్ అడ్మిషన్ ఫీజు అధికంగా వసూల్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా ఇలాంటి ప్రైవేట్ పాఠశాలలా, కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.