22
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులో మొండి చేయి చూపించడం సరైన పద్ధతి కాదని ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కార్యాలయంలో డాక్టర్ రామకృష్ణ పెరుమాండ్ల అన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల వారిగా కొన్ని రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నచూపు ఎందుకు చూస్తున్నారు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రి స్థానంలో ఉండి తెలంగాణ మొండి చేయి చూపించడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ లో బీజేపీ ఎంపీలని నిలదీసి మన బడ్జెట్ ఎందుకు తెసుకురాలేకపోయారని ప్రశ్నించాలని కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలను, తెలంగాణ ప్రజలకు సూచించారు.