30
ఏపీలో అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం దందాకు ప్రధాన కారణం ఆ బియ్యంను ప్రజలు తినకుండా బ్లాక్ లో అమ్ముకోవడమేనని గుర్తించిన అధికారులు, నివారణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని బ్లాక్ లో కొన్నట్లు తెలిస్తే వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అమ్మిన వారి వద్ద నుంచి సైతం రేషన్ కార్డు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.