రాజమండ్రిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలని బిజెపి గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి, నరసింగరావు, బిజెపి జిల్లా కార్యదర్శి, డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ బొండా యల్లాజీరావు కోరారు. ఈ సందర్బంగా గత ప్రభుత్వాలు అనాలోచిత, అవినీతి చర్యలు కారణంగా ప్లాంట్ తీవ్ర కష్టాలు ఎదుర్కొనే పరిస్థితిలు ఏర్పడ్డాయని, గతంలో కూడా ప్లాంట్ కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటి వాజాపేయ్ గారి ప్రభుత్వం 1333 కోట్ల రూపాయలు అప్పులను మాఫీ చేసి ప్లాంట్ ను ఆదుకోవడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయడం లేదా అప్పులను మాఫీ చేయడం వంటి ప్రత్యామ్నాయ విధానాలు ద్వారా ప్లాంట్ పూర్తి స్థాయి సామర్ధ్యం ఉపయోగించుకొంటే త్వరలోనే లాభాల బాట పడుతుందని, తద్వారా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగం, 26 వేల ఎకరాలు భూమిని త్యాగం చేసిన నిర్వాసితులకు పూర్తి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు కట్టా పద్మ, బిజెపి వడ్లపూడి మండల అధ్యక్షులు బొండా శ్రీదేవి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఆదుకొని, నిర్వాసితులకు న్యాయం చేయండి.. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ని కోరిన బీజేపీ నేతలు
42