- అవార్డు బహుకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మెగాస్టార్ చిరంజీవి గురువారం అవార్డులో పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు జాతీయ ద్వితీయ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో గురువారం ఈ అవార్డుల ప్రదానం జరిగింది. కళారంగానికి చేసిన సేవలకు గాను చిరంజీవి ఈ పురస్కారం అందుకున్నారు. 2024 రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ విభూషణ్ అందించబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌లో గురువారం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు.
కేంద్ర ప్రభుత్వం చిరును పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవితో పాటు ప్రఖ్యాత నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల బాలి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులు మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ సంవత్సరం మొత్తం 132 ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించగా.. వీటిలో. 5 పద్మవిభూషణ్17 పద్మభూషణ్110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.