తెలంగాణ రాజకీయాల్లో ‘హైడ్రా కూల్చివేతలు’ ప్రకంపనలు రేపుతున్న విషయం తెలిసిందే. విపక్ష పార్టీలకు చెందిన నేతలను దెబ్బతీసేందుకేనని బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేఖ రాశారు. దయచేసి తెలంగాణను మరో బుల్‌డోజర్ రాజ్యంగా మారకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని లేఖలో కేటీఆర్ కోరారు. ప్రియమైన మల్లికార్జున ఖర్గే గారూ.. మీరు చెప్పినట్లుగా ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయం, అన్యాయం. తెలంగాణాలో చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతోంది. మహబూబ్‌నగర్ పట్టణంలో 75 పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు. నిన్న అక్రమంగా కూల్చివేసిన నిరుపేదల్లో 25 కుటుంబాల్లో శారీరక వికలాంగులు కూడా ఉన్నారు. ఆమోదయోగ్యమైన పద్ధతులు పాటించకుండా, విధి విధానాలు లేకుండా అమలు చేసే చట్టం చట్టమే కాదు. అడ్డగోలుగా నిరుపేదలపైకి బుల్డోజర్ నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్యాంగ మార్చకుండా ఆదేశాలు ఇవ్వండి’’ అంటూ మల్లికార్జున ఖర్గేకి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్ లేఖ..
10
previous post