Home » కాశీ- కాంప్లెక్స్- శంబాలా! కల్కి రిలీజ్ కి ముందే తెలుకోవాల్సిన విషయాలు! – Sravya News

కాశీ- కాంప్లెక్స్- శంబాలా! కల్కి రిలీజ్ కి ముందే తెలుకోవాల్సిన విషయాలు! – Sravya News

by Sravya News
0 comment










ప్రస్తుతం బాగా చర్చ జరుగుతున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది కల్కి 2898 ఏడీ అనే చెప్పాలి. ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్‌గా మారింది. ఇప్పటికే ఈ మూవీ మీద భారీగా అంచనాలు ఉన్నాయి. వాటిని రెట్టింపు చేస్తూ తాజాగా సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్స్, ఈ అప్ డేట్స్ అన్నీ చూసిన తర్వాత అందరూ అడుగుతున్న ప్రశ్నలు ఈ కాంప్లెక్స్ ఏంటి? ఈ కాశీ కథ ఏంటి? అసలు ఈ శంబాలా ఏంటి అంటే. అయితే నాగ్ అశ్విన్ మొదటి నుంచి ఈ సినిమాని పురాణాల నేపథ్యంలోనే తెరకెక్కిస్తున్న విషయం స్పష్టంగా చెప్పాడు. పైగా అశ్వత్థామ పాత్రను కూడా చూపించాడు. ఆ లెక్కల ప్రకారం ఈ శంబాలకు చాలా పెద్ద కథే ఉంది.

కాంప్లెక్స్:

నాగ్ అశ్విన్ ఈ కల్కి సినిమా ఒక సైంటిఫిక్ మైథాలజీ అని ముందే చెప్పాడు. అందుకే పురాణాల్లో ఉన్న కాశీ, శంబాలకు అదనంగా.. ఈ టెక్నాలజీని జోడిస్తూ కాంప్లెక్స్ అనే మూడో ప్రాంతాన్ని సృష్టించాడు. 2898 ఏడీలో ప్రపంచం మొత్తం దాదాపుగా తుడిచిపెట్టుకుని పోతుంది అనే దాన్ని మనం ఈ ట్రైలర్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కాంప్లెక్స్ ని కేవలం డబ్బు ఉన్న వారి కోసమే నిర్మించారు. అంటే నీకు నీ ప్రాణం కావాలి అంటే నీ దగ్గర 1 మిలియన్ యూనిట్లు ఉండాలి. అంటే ఇది వ్యాపారం. భూమిలో ఉన్న నీరు తోడేసి ఆ కాంప్లెక్స్ కి తరలిస్తూ ఉంటారు. అలా ఈ కాంప్లెక్స్ కేవలం డబ్బున్న వారి స్వర్గథామం. అలాగే కల్కి స్థావరం కూడా అదే.

కాశీ:

మన పురాణాల ప్రకారం చిట్ట చివరి నగరం అని అందరికీ తెలుసు. ప్రతి ప్రయాణం, ప్రతి మజిలీ ముగిసేది అక్కడే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సినిమాలో కూడా కాశీ ప్రాధాన్యత దాదాపుగా అలాగే ఉంటుంది. అంటే టెక్నాలజీ ఎంత వచ్చినా కూడా కాశీ మాత్రం తన ప్రాశస్త్యాన్ని కోల్పోకుండా అలాగే కాలంతో పాటు తన ప్రయాణాన్ని సాగిస్తూనే ఉంది. అయితే అక్కడి ప్రజల బాధలు మాత్రం వర్ణనాతీతం అని తెలిసిపోతోంది. అక్కడ బతుకు, చావు రెండు పోరాటమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కనిపించడం లేదు. ఇంకా అక్కడి ప్రజల కష్టాలు కూడా అదే తరహాలో ఉన్నాయి. ఆ నగరంలో ఉండే భైరవ మాత్రం కాంప్లెక్స్ కి వెళ్లాలి అని బౌంటీల కోసం చూస్తూ ఉంటాడు.

శంబాల:

ఇన్ని రోజుల నుంచి కొంత మందిని హైలెట్ చేస్తూ విజువల్స్ చూపించారు. కానీ, శంబాలా అనే ఒక నగరం ఉంది అని ఇటీవలే డైరెక్టర్ రివీల్ చేయడం చూశాం. ఆ శంబాల నగరం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. పురాణాల ప్రకారం శంబాల అంటే దేవతలు నివసించే చోటు. అది మానవ మాత్రులకు కనిపించదు. అలాంటి శంబాల నగరం కూడా కాలక్రమేణా వెలుగులోకి వచ్చి ఉండచ్చు. రాబోయే కల్కి కోసం వాళ్లు ఆ శంబాలాలో అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కలి నుంచి కల్కిని కాపాడుకునేందుకు ఆ నగరంలో ఉన్న వాళ్లంతా పోరాటాలు చేస్తున్నారు. ఈ కలి మీద యుద్ధం చేసే వాళ్లు, మంచి వాళ్లు అంతా శంబాల కోసం పోరాటాలు చూపిస్తున్నారు. ఈ పోరులో అశ్వత్థామ.. కల్కిని కాపాడేందుకు శపథం తీసుకున్నాడు. భైరవ యూనిట్స్ కోసం అశ్వత్థామతోనే యుద్ధానికి కాలు దువ్వాడు. దైవం- టెక్నాలజీ మధ్య జరగబోతున్న యుద్ధంలో విజయం ఎవరిదో తెలియాలంటే జూన్ 27 వరకు ఆగాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి





You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in