సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో వార్తలు మనకు కనిపిస్తూనే. అనేక సార్లు సెలబ్రిటీలు, ఆర్టిస్టులు సినీ రంగం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొందరు సినీ ఇండస్ట్రీ గురించి గొప్పలు చెప్తుంటే, మరికొందరు మాత్రం అందులో కొన్ని లోపాలను వ్యక్తపరుస్తుంటారు. ఈ కొన్ని విషయాల గురించి తెలిసినప్పుడు నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోరుకునే వంటమనిషికి అయ్యే ఖర్చు గురించి ఓ బాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన అనేక విభిన్నమైన సినిమాలను డైరెక్ట్ చేశారు. ఇంకా అనేక హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్లతో కశ్యప్ పని చేశారు. ఇది ఇలా ఉంటే..ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన..షాకింగ్ కామెంట్స్ చేశారు. స్టార్స్ , సెలబ్రిటీల గురించి ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కొందరి స్టార్ల వెంట ఉండే వ్యక్తిగత సిబ్బంది విషయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వంట మనుషుల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ న్యూస్ తెలిసిన నెటిజన్లు కూడా నోరెళ్లబెడుతున్నారు.
ఇటీవల ఈ ఈవెంట్‌లో పాల్గొన్న అనురాగ్ కశ్యప్ స్టార్స్ మాట్లాడుతూ.. కొంతమంది సెలబ్రిటీలు షూటింగ్ సమయంలో ఆహారం కోసం ప్రత్యేకంగా వంటవారిని నియమించుకుంటున్నారని, వారు రోజుకు లక్షల్లో డిమాండ్ చేసి.. వసూలు చేశారని తెలిపారు. అంతేకాదు.. హెయిర్, మేకప్ ఆర్టిస్టులను కూడా ప్రత్యేకంగా తెచ్చుకుంటున్నారని, వారు కూడా రోజులో లక్షల్లో తీసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. ఈ ఖర్చు సినిమా కోసం వారి కంటే చాలా ఎక్కువ ఉందని చెప్పారు. అసలు ఆ పనులే నేర్చుకొని ఉంటే తాను ఈపాటికే ధనవంతుడిని అయ్యేవాడినని ఆ డైరెక్టర్ హాట్ కామెంట్స్ చేశాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కూడా ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన షూటింగ్ సమయంలో బర్గర్ కోసం ఓ హీరో తన డ్రైవర్‌ను అక్కడి నుండి దూరం పంపాడని, ఇలాంటి ఖర్చులు సినిమా నిర్మాణ ఖర్చును పెంచుతున్నాయని తెలిపాడు. ఇలాంటి వారిని ప్రొడ్యూసర్లు సెట్స్ పైకి అనుమతించకూడదని తెలిపాడు. మొత్తంగా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. మరి.. ఆయన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
