Home » ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ఎందుకంటే..! – Sravya News

ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ఎందుకంటే..! – Sravya News

by Sravya News
0 comment
ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన అమితాబ్.. ఎందుకంటే..!


ప్రస్తుతం ఏ ఇద్దరు సినీ లవర్స్ కలిసిన మాట్లాడుకునే అంశం కల్కి 2898ఏడీ. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అందరు ఈగర్ ఉన్నారు. ఈ విధంగా ప్రభాస్ కల్కి 2898ఏడీ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్స్ ఈ సినిమాపై భారీ అంచాన్ని పెంచేశాయి. మరో టికెట్ బుకింగ్ ఓపెన్ కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది…అనేక ఆసక్తికర విషయాలు మూవీ టీమ్ బయట పెడుతుంది. ప్రభాస్ అభిమానులకు సారీ చెప్పారు. మరి.. ఎందుకు, ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం…

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898ఏడీ సినిమా జూన్ 27 థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్స్ అందరిలో ఆసక్తిని మరింత స్థాయికి తీసుకెళ్లాయి. మరోవైపు సినిమా విడుదల సమయం దగ్గర పడే కొద్ది మూవీ మేకర్స్, టీమ్ సభ్యుల ఆసక్తికర విషయాలు బయట పెడుతున్నారు. తాజాగా కల్కి టీం అంతా కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ అవసరాలకు సంబంధించిన అనేక విషయాలు. ఇదే సమయంలో అమితాబ్ మాత్రం ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడీ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమితాబ్

‘కల్కి 2898ఏడీలో భైరవగా ప్రభాస్, అశ్వద్థామగా అమితాబ్ బచ్చన్ నటించారు. వీళ్లిద్దరి మధ్య భారీ స్థాయిలో ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయట. ట్రైలర్ చూస్తే.. ఈ విషయం అర్థమైపోతుంది. ఈ ఫైటింగ్ సీన్ గురించి అమితాబ్ బచ్చన్ ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పాడు. మూవీ చూసిన తర్వాత తనని తిట్టుకోకూడదని, ట్రోల్ చేయొద్దని బిగ్ బీ చెప్పుకొచ్చారు.

నాగ అశ్విన్.. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి తన దగ్గరికి వచ్చినప్పుడు పాత్ర ఎలా ఉండబోతుందని, ప్రభాస్ పాత్ర ఏంటనేది చూపించడానికి కొన్ని ఫొటోలు చూపించాడని అమితాబ్ బచ్చన్ చెప్పాడు. ‘కల్కి’లో తనది ప్రభాస్‌ని కొట్టే పాత్ర అని చెప్పాడు. అందుకే ముందే చెబుతున్నా ప్రభాస్ ఫ్యాన్ దయచేసి క్షమించండని అన్నారు. ఈ సినిమాలో తాను చేసే పనులు చూసిన తర్వాత తిట్టుకోకండని, ట్రోల్ చేయకండని అమితాబ్ అన్నాడు. దీనికి ప్రభాస్ నవ్వుతూ.. ‘అయ్యో సర్, వాళ్లంతా మీకు కూడా అభిమానులేనని తెలిపాడు. మొత్తంగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in