అమరావతి, ఈవార్తలు : దానవీరశూరకర్ణలో ఎన్టీఆర్కు మించి చంద్రబాబు నటిస్తున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సెటైర్ వేశారు. రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని చంద్రబాబు అంటే.. ఆ తర్వాత పవన్ కల్యాణ్, పురందేశ్వరి వత్తాసు పలుకుతూ.. గత ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎగ్గొట్టేందుకు జగన్ అప్పులు చేశాడని.. తన పేరు చెప్పి ప్రజలను చంద్రబాబు మోసం చేశాడని ధ్వజమెత్తారు. 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టగా, దానిపై తాడేపల్లిగూడెంలో జగన్ మీడియాతో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు బడ్జెట్ ఉందని. చంద్రబాబు మోసాలు, అబద్ధాలు బయటకు వస్తాయని ఇన్ని రోజులు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీశారని.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 4 మాత్రమే మిగిలి ఉండగా.. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రజలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు మాటలన్నీ డ్రామా అని బడ్జెట్తో తేలిపోయిందని జగన్ ఎద్దేవా చేశారు. ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్లా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఫేక్ ప్రచారం చేసి వైసీపీ ప్రభుత్వం విఫల ప్రభుత్వంగా చూపే ప్రయత్నం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2019లో టీడీపీ ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి రూ.3.13 లక్షల కోట్ల అప్పులు ఉండగా, 2024లో తాము దిగిపోయే నాటికి రూ.6.46 లక్షల కోట్ల అప్పు ఉందని వివరించారు. అయితే, రూ.10 లక్షలు కోట్లు.. రూ.14 లక్షల కోట్ల అప్పు అని తమపై తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
లగచర్ల కేసులో ట్విస్ట్.. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు
బీట్రూట్ తినీ తినీ బోర్ కొడుతోందా.. ఇలా ట్రై చేయండి