ఖమ్మంలోని తెలంగాణ అల్ప సంఖ్యాకుల గురుకుల విద్యా సంస్థల (పాఠశాల, జూనియర్ కళాశాల) ఆధ్వర్యంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనారిటీ వర్గాలలో ఆడ పిల్లలను బడికి పంపించాలంటే ఇబ్బంది పడే రోజుల నుంచి మన పిల్లలను చదివిస్తే తప్ప భవిష్యత్తు ఉండదు అని భావించే వరకు, పెద్ద ఎత్తున అన్ని కులాలు, మతాల వారు కలిసి విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కస్తాల సత్యనారాయణ, జిల్లా మైనారిటీ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ సీత మహాలక్ష్మి, ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు..
51