60
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీ కేంద్రం లోనీ పిల్లిగుండ్ల కాలనిలో యదేచ్ఛగా విద్యుత్ పోల్స్ కు అక్రమ విద్యుత్ సర్వీస్ వైర్లు భయం లేకుండా తగిలించుకొని అక్రమంగా విద్యుత్ ను వినియోగించుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. రాజకీయ పరంగా అండదండలు ఉన్న వ్యక్తుల గృహలకు అక్రమ విద్యుత్ కనక్షన్స్ తీసుకొని అక్రమంగా విద్యుత్ ను వినియోగించుకుంటున్నట్టు సమాచారం. వెంటనే జిల్లా విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.