29
వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి లో వెలిసిన స్వయంభు శ్రీ కోటలో సత్యమ్మ తల్లిని గురువారం దీపావళి సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పులి సత్యనారాయణ రెడ్డి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వాల్మీకిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కంభం నిరంజన్ రెడ్డి సతీసమేతంగా గురువారం కోటలోశ్రీ సత్యమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత్రమన్ కంభం నిరంజన్ రెడ్డి ఆలయ అభివృద్ధి పనుల గురించి అధ్యక్షుని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఇట్లం వారి పల్లి సత్యనారాయణ రెడ్డి, చక్రపాణి అమర్నాథ్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ గుర్రప్ప, తదితరులు పాల్గొన్నారు.