5
ఎన్నికల హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం నేడు ప్రారంభం కానుంది. శ్రీకాకుళం(D) ఈదుపురంలో ఈ కార్యక్రమానికి CM చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఏలూరు(D) ఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లబ్ధిదారులకు సిలిండర్లను పంపిణీ చేస్తారు. కాగా గత నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ మొదలయ్యాయి. పూర్తి మొత్తం ఇచ్చి సిలిండర్ను తీసుకుంటే 48 గంటల్లో సబ్సిడీని ప్రభుత్వం జమ చేస్తుంది.