8
విశాఖ పాల డైరీ యాజమాన్యం ప్రభుత్వం భూమి కబ్జా చేసింది అని కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన సిపిఎం పార్టీకు చెందిన అంగ లోకేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అక్కిరెడ్డిపాలెం గ్రామం సమీపంలో సర్వే నెంబర్ 47/3లో దాదాపుగా మూడు ఎకరాల భూమి కబ్జా జరిగిందని వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదే కబ్జా పై జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ జిల్లా రెవిన్యూ అధికారులకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో విశాఖ డైరీ కబ్జా చేసిన స్థలాన్ని గాజువాక తహసీల్దార్ కార్యాలయం సర్వేయర్ రామారావు, ఆర్ఐ మహేష్, వీఆర్వో ఆనంద్, సిబ్బంది పరిశీలించారు.