Home » దువ్వాడ శ్రీనివాస్‌పై వైసీపీ అధిష్ఠానం వేటు – Sravya News

దువ్వాడ శ్రీనివాస్‌పై వైసీపీ అధిష్ఠానం వేటు – Sravya News

by Sravya News
0 comment
దువ్వాడ శ్రీనివాస్‌పై వైసీపీ అధిష్ఠానం వేటు


అమరావతి, ఈవార్తలు : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను టెక్కలి వైసీపీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించింది. దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్‌కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దువ్వాడ కుటుంబ సమస్యలు తలనొప్పిగా మారడంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి పార్టీలో, రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. కిల్లి కృపారాణికి అవకాశం వరిస్తుందని అనుకున్నా.. దువ్వాడను తప్పిస్తే కిల్లి కృపారాణి, పేరాడ తిలక్‌కు పార్టీ టెక్కలి ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నా.. పేరాడ తిలక్ వైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. గతంలో ఇన్చార్జిగా పనిచేసిన అనుభవం ఉన్నందున ఆయనకే జగన్ ఓటు వేశారు.

కుటుంబ కలహాలు దూరం చేసిన పదవి

నిజానికి భార్య ఎన్నికల ముందు వరకు దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి ఇన్చార్జిగా కొనసాగారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య పొసగ.. గ్రూపులు ఏర్పడ్డాయి. సయోధ్య కుదురుతుందని నమ్మకంపై.. గ్రూపులు కట్టడంపై జగన్ అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ మళ్లీ ఎన్నికల సమయంలో శ్రీనివాస్ వైపే మొగ్గు చూపారు. అయితే తాజాగా భార్యాభర్తల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. దువ్వాడను ఇలాగే కొనసాగిస్తే పార్టీ మరింత దెబ్బతినడం ఖాయమని భావించి పార్టీ అధిష్ఠానం ఇంచార్జిని మార్చినట్లు అవుతోంది.

TGPSC గ్రూప్ 2 షెడ్యూల్ | గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదల
మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో టాప్ 10 దేశాలు ఇవే..

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by BlueSketch.in