64
భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు స్థానిక భరతమాత విగ్రహం వద్ద కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈరోజు దేశం సుభిక్షంగా శాంతితో సంతోషంగా ప్రజలు జువిస్తున్నారంటే మన భారత సైనికుల యొక్క త్యాగాలే అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కల్లేడ ధర్మపురి, రాష్ట్ర కిషోర్ మోర్చా కార్యవర్గ సభ్యులు కురుమ మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మహేష్, పట్టణ ఉపాధ్యక్షులు కడార్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.